పత్రికలు, చానళ్లకు గుండెకాయ లాంటి డెస్క్ సభ్యులు వివక్షకు గురవుతున్నరు. అక్రిడేషన్లు ఉండవు.. గుర్తింపు ఉండదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న కష్టాలను జర్నలిస్టుల్లో డెస్క్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్నరు.
తరతరాలుగా జరుగుతున్న అన్యాయంపై డెస్క్ జర్నలిస్టులు రగల్ జెండా ఎగురవేశారు. అక్రిడేషన్ల కోసం పోరుబాట పట్టారు. సమచార, ప్రజాసంబంధాల (ఐ అండ్ పీఆర్) ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. అక్రిడేషన్లతో పాటు ప్రభుత్వం తరఫున అందుతున్న అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
పోరుడుదాం.. డిమాండ్లు సాధించుకుందాం…..