అక్రమ అరెస్టులకు తెరలేపిన ప్రభుత్వం

 హైదరాబాద్: రేపు సడక్‌బంద్‌కు సన్నాహక కార్యక్రమాలు చేస్తున్న జేఏసీ నాయకులను, టీఆర్‌ఎస్ నాయకులను సీమాంధ్ర సర్కారు అరెస్టు చేస్తుంది. పది జిల్లాల్లో తెలంగాణవాదులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు తెరలేపింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో 20 మంది, ఉట్నూరులో 15 మంది జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌లో సడక్ బంద్‌కు ముందుగానే జిల్లా జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు, షాద్‌నగర్‌లో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీంలను అరెస్టు చేశారు. వరంగల్ జిల్లాలో జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్‌తో సహా పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవిశ్రీప్రసాద్ హెచ్చరించారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.