అక్బరుద్దీన్ అరెస్ట్

owasi2 నాటకీయ పరిణామాల నడుమ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు మంగళవారం ఇక్కడ గాంధీ ఆస్పత్రిలో అరెస్టు చేశారు. అంతకుముందు గాంధీ ఆస్పత్రిలో అక్బరుద్దీన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉందని వైద్యులు నివేదిక ఇవ్వడంతో అప్పటికే ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఐపీసీ 121, 153ఏ సెక్షన్ల ప్రకారం అరెస్టు చేస్తున్నట్టు వరంగల్ రేంజ్ ఐజీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. అనంతరం పోలీస్ వాహనంలో నిర్మల్‌కు తరలించారు. రోడ్డు మార్గం మీదుగా రాత్రి 9.30 గంటలకు నిర్మల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్బరుద్దీన్‌తో పాటు ఆయన సోదరుడు బుర్హానుద్దీన్, మరికొందరు మజ్లిస్ నాయకులు వెళ్లారు. రోజంతా కొనసాగిన హైడ్రామాతో హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పాతబస్తీతో పాటు అన్నిప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.