అక్బరుద్దీన్‌పై రెండు కేసులు నమోదు:డీజీపీ

హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై రెండు కేసులు నమోదు చేశామని డీజీపీ దినేష్‌రెడ్డి వెల్లడించారు. భారతీయ శిక్షాస్మృతి 121, 153(ఏ) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. సమన్లు ఇచ్చేందుకు ఓవైసీ నివాసానికి వెళ్తే ఆయన లండన్‌లో ఉన్నారని తేలిందన్నారు. ఆయన ప్రసంగాన్ని ఉర్దూలోంచి తెలుగులోకి తర్జుమా చేసిన తర్వాత అభియోగాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అక్బరుద్దీన్‌ను అరెస్టు చేసేందుకు అవసరమైతే ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటామని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.