అక్కడ జర్నలిస్టుల బతుకులు అడ్డా కూలీలకన్నా అధ్వాన్నం

డెస్క్ లో వాటరా? ఎందుకు? వాళ్లు చేసే పనికి నీళ్లు కూడానా అంటాడట హెచ్ ఆర్. టిఫిన్ చేయడానికి కిందికి వెళ్తే సెక్యూరిటీ గార్డ్స్ దొంగలను వెంబడిస్తున్న వెళ్లి వెనక్కి తీసుకొచ్చిండట. 9గంటలు ఆఫీస్ లో నిర్బంధిస్తున్నరు.  ఇక జీతాలు ఇచ్చేటప్పుడు ముష్టి వేసినట్టు చెక్ లు పడేస్తున్నరు. చెక్ తీసుకునేందుకు జర్నలిస్టులు హెచ్ఆర్ చుట్టూ తిరగాలట. లేకపోతే హెచ్ఆర్ పిలిచినప్పుడు అడ్డా కూలీల్లాగా వెళ్లి వెయిట్ చేయాలట. అకౌంట్ పే ఇవ్వొచ్చుగా సార్ అని అడిగితే ఎట్ల పడేస్తే అట్ల తీసుకోండి అంటున్నరట. సంతకం పెట్టే నాకు లేని నొప్పి మీకెందుకు అంటున్నరట. చిన్న దుకాణం పెట్టుకున్నోడు కూడా వర్కర్లకు బ్యాంక్ అకౌంట్ తీసి సాలరీ ఇచేస్తున్నడు. సీవీఆర్ లో జర్నలిస్టులు బానిసల కంటే హీనంగా బతుకీడుస్తున్నరు. ఇదేం అరాచకం మిస్టర్ సీవీఆర్. నీకేమైనా తిక్కా. నీ షాడిజానికి అగ్గితగల. మానవత్వంతో ప్రవర్తించు. జర్నలిస్టులు నీ బానిసలు కాదు.

సీవీఆర్ జర్నలిస్టులూ ఇప్పటికైనా తిరగబడండి. యాజమాన్యాన్ని కోర్టుకు ఈడ్చండి. బొంగులో ఉద్యోగం. ఇది కాకపోతే ఇంకో చానల్. అదీ కాకపోతే మరోటి. అంతేకానీ బానిసలుగా పడి ఉండకండి. బానిస బతుకులు ఇంకెన్నిరోజులు బతుకుతరు. లేబర్ యాక్ట్ ప్రకారం ప్రొసీడ్ అవండి.

 

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.