అంతా థూ థూ అంటే ఆంధ్రా మీడియా వహ్వా అంటుంది

కుక్కతోక సక్కగైతదా?.. సీమాంధ్ర మీడియా తీరు మారుతదా? ఓవైపు దేశంలో, మరోవైపు విదేశాల్లో అంతా థూ థూ అంటున్నా సరే. సీమాంధ్ర మీడియాకు మాత్రం గురువారం నాటి పార్లమెంటు సంఘటనలు తప్పుగా అనిపించలేదు. కనిపించలేదు. గురువారం దేశంలోని అన్ని భాషల్లో, అన్ని ప్రాంతాల్లో ఎన్ని పత్రికలు ఉన్నాయో అన్నీ,ఎన్ని టీవీలు ఉన్నాయో అన్నీ పార్లమెంటులో సీమాంధ్ర ప్రతినిధుల ప్రవర్తనను తీవ్రంగా గర్హించాయి. తిట్టని పత్రిక లేదు. తూర్పారబట్టని టీవీ లేదు. అయినా సరే.. అత్యున్నత చట్టసభ అయిన లోక్‌సభలో రౌడీల్లా ప్రవర్తించిన ఎంపీల మీద సీమాంధ్ర మీడియాకు లవ్వు ఉప్పెనలా పొంగుకొచ్చింది. లగడపాటి కేవలం ఆత్మరక్షణకోసమే పెప్పర్ స్ప్రే వాడారని వెనకేసుకొచ్చింది. సంచలనం సృష్టించారని పొగడ్తలందుకుంది.
tvadd అభినవ భగత్ సింగ్ అంటూ ప్రకటనలతో దరువేసింది. తెలంగాణ ఎంపీలే దాడికి దిగారని దోషులుగా నిలబె తెగించింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి దాదాగిరితో సమావేశాలు అడ్డుకున్నది సీమాంధ్ర ప్రతినిధులే అన్న విషయమే తెలియనట్టు… ‘సభలో ఏం జరుగుతుందో చూడండి’ అని ఒకరు… ‘ఏమైనా జరగవచ్చు’ అంటూ ఇంకొకరు బెదిరింపులకు పాల్పడిన విషయం పక్కన బెట్టి.. సీమాంధ్ర ఎంపీలు నోట్లో వేలేసినా కొరకని వారన్నట్టు.. బరి తెగించి సమర్థించింది. మేం రాసిందే రాత.. మేం గీసిందే గీత అన్నట్టు తమ ధోరణి కొనసాగించింది.

సిగ్గుపడితే సీమాంధ్ర మీడియా ఎట్లవుద్ది? అన్నట్టు ఓవైపు జాతీయ మీడియా, జాతీయ నేతలు, దేశ విదేశాల్లో ప్రజాస్వామ్యవాదులు, మాజీ స్పీకర్లు, మంత్రులు సీమాంధ్ర ఎంపీల చర్యలను ఛీ కొడుతున్నా అవేమీ జరగనట్టు వీళ్లేదో పోరాట యోధులన్నట్టు కథలు వండి వార్చాయి. మామూలు సమయంలో తెగ తన్నుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు ఈ విషయంలో మాత్రం కూడబలుక్కున్నట్టు ఒక్కటైపోయి ఒకే కథను మూడు బ్యానర్ల కింద సమర్పించారు. నిజాల నిగ్గు తేల్చే తెలంగాణ మీడియా రంగంలో లేనట్టయితే రాష్ట్ర ప్రజలంతా జరిగిన సంఘటనలను గుడ్డిగా నమ్మేవారోమో!
media గురువారం లోక్‌సభలో ఏం జరిగిందో కొత్తగా చెప్పనక్కర లేదు. అనేక జాతీయ దినపవూతికల్లో సవివరంగా వచ్చేసింది. హిందీ, ఇంగ్లీషు టీవీ చానెళ్లలోనూ ప్రసారమైంది. తెలంగాణ మీడియా సభలో జరిగిన ఫుటేజ్‌లు ఖుల్లంఖుల్లా ప్రదర్శించింది. రాజగోపాల్ తన చుట్టుపక్కల కూడా ఎవరూ లేకున్నా ఉద్దేశపూర్వకంగా స్పీకర్ సహా అందరిమీద అన్ని వైపులా స్ప్రే చేస్తున్న దృశ్యాలు ప్రసారమయ్యాయి. టీ ఎంపీలు ఆయన సమీపంలో కూడా లేరు. అయినా మన సీమాంధ్ర పత్రికలు ఆ కథనాన్ని ఇలా వక్రించి ప్రచురించాయి.

ఈనాడు ‘తలవంపు స్వామ్యం’ అన్న శీర్షికన వార్తా కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో మోదుగుల స్పీకర్ వద్దకు రావడానికి ప్రయత్నిస్తుంటే రాథోడ్ నామా, విజయశాంతి అడ్డుకున్నారని, వెనకవైపునుంచి పొన్నం మాణిక్ ఠాకూర్, సురేష్ దాడి చేశారని రాసింది. రాజగోపాల్ ఆయనకు రక్షణగా వస్తుండగా గుత్తా సుఖేందర్ రెడ్డి, అరుణ్ యూసుఫ్, మందా జగన్నాథం అడ్డుకోవడంతో పెనుగులాటలో లగడపాటి తన జేబులో నుంచి పెప్పర్ స్ప్రే తీసి గాల్లోకి చిమ్మారని రాసింది. ఇక ఆంధ్రజ్యోతి ‘పట్టుకో…కొట్టుకో’ అన్న శీర్షికన ప్రచురించిన వార్తా కథనంలో మోదుగులపై కోమటిడ్డి, నామా నాగేశ్వరరావు, రమేశ్‌రాథోడ్, రాజ్‌బబ్బర్, సురేష్, మాణిక్ సర్కార్, పొన్నం, ధ్రువ నారాయణ, వినోద్‌పాండే, మందా జగన్నాథం చేయి చేసుకున్నారని రాసింది. రాజగోపాల్ దాడిని అడ్డుకునేందుకు వెళుతుండగా అరుణ్ యూసుఫ్, పొన్నం, సుఖేందర్‌డ్డి, మందా లగడపాటిని గట్టిగా పట్టుకున్నారని ఈ క్రమంలో కింద పడిపోయిన లగడపాటి తన జేబులో ఉన్న స్ప్రేను దాడి చేస్తున్న ఎంపీలపై వదిలారని నిజనిర్దారణ చేసింది. సాక్షి తక్కువ తినలేదు.‘పక్కా ప్లాన్‌తో సీమాంధ్ర ఎంపీలకు చెక్’ అంటూ ప్రచురించిన కథనంలో ప్రభుత్వ మొండి వైఖరితో సీమాంధ్ర ఎంపీలు తీవ్ర చర్యలకు దిగారని, విజయవాడ ఎంపీ సభలో మిరియాల పొడి చల్లి సంచలనం సృష్టించారని మెచ్చుకుంది.

ఇదే టీ ఎంపీలు చేసి ఉంటే…
ఇవాళ తెలంగాణలో పదేళ్ల పిల్లవాడికి కూడా తెలుసు.. ఇదే స్ప్రే టీ ఎంపీలు చల్లి ఉంటే ఈ మీడియా ఎలా స్పందించి ఉండేదో? దేశవూదోహులుగానో.. టెర్రరిస్టులుగానో వెంటపడి వేటాడి ఉండేది. ఆ ఒక్క కారణం మీద గాయిగాయి చేసి హైదరాబాదో… సీమాంవూధుల రక్షణో అంటూ శోకాపూత్తుకుని ఉండేది. టీముల మీద టీములను పంపించి రాష్ట్ర ఏర్పాటుకు మోకాలడ్డి ఉండేది. ఒకనాడు ట్యాంక్‌బండ్ విగ్రహాలు పగిలితే ఉన్మాదమన్న వాళ్లు.. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇందిర రాజీవ్ విగ్రహాలు కూల్చి కాళ్లతో తన్నుతుంటే సీమాంధ్ర ఆగ్రహాగ్రి అంటూ వత్తాసు పలికిన ఉదంతాలు తెలుసు. జేపీ తల మీద చేయి తాకితేనే సీమాంవూధులపై దాడి అంటూ గగ్గోలు పెట్టిన ఇదే మీడియా వీహెచ్ మీద తిరుపతిలో రాళ్లు, ఇటుకలు వేసినా దాన్ని తెలంగాణ మీద దాడి అనడానికి నోరు రాలేదు.

కర్నూలులో గర్భవతిని తరిమివేసినా..శ్రీశైలం యాత్రికులను చితకబాదినా, గోదావరి జిల్లాలో తెలంగాణ అధికారి మీద పేడ చిమ్మినా ఉద్యోగుల మీద దాడులు చేసినా అవేవీ పెద్ద ఘటనలే కానట్టు వ్యవహరించిన విషయాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అది నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారీ తెలంగాణ ప్రజల ఆకాంక్షపై ఉవ్వెత్తున నడిచిన ఉద్యమంపై విషం చిమ్ముతూ వచ్చిన సీమాంధ్ర మీడియా ఈసారి కూడా అదే వైఖరిని ప్రదర్శించింది. దేశం సిగ్గుపడే ఘటనలను ఏ మాత్రం సిగ్గులేకుండా సమర్థించ చూశాయి. ఇక అలా దాడి జరగ్గానే ఇలా ‘సీమాంధ్ర భగత్‌సింగ్’ అంటూ ప్రకటనలు కూడా గుప్పించాయి. ప్రత్యేక ఇంటర్వ్యూలు అంటూ ఆకాశానికి ఎత్తే ప్రయత్నాలు చేశాయి. నిజమే మరి. నాదెండ్ల చేస్తే వెన్నుపోటు అని..చంద్రబాబు చేస్తే పార్టీ రక్షణ అంటూ నాలుకలు అటు ఇటూ మడిచిన వారికి ఇదో లెక్కా?

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.