అం‘జనా’ద్రి

– జనసంద్రంలా కొండగట్టు
– లక్షలాది దీక్షాపరుల మాలవిరమణ
– కాషాయమయమైన అంజన్న సన్నిధి
– ఘనంగా హనుమాన్ పెద్ద జయంతి
హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని, సోమవారం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కొండగట్టు జనసంవూదమైంది. చందన వర్ణపు వస్త్రధారులైన దీక్షాపరుల సందడితో ఎటుచూసినా కాషాయ శోభితమైంది. ‘రామ లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్‌కీ’ అంటూ భక్తుల స్మరణతో పులకించింది.
యేటా వైశాఖ బహుల దశమిన నిర్వహించే హనుమాన్ పెద్ద జయంతిని కొండగట్టు అంజన్న సన్నిధిలో సోమవారం వైభవోపేతంగా నిర్వహించారు.

ఆలయ అర్చకులు ఉదయం 3 గంటల నుంచి స్వామి వారికి తిరుమంజనం, ద్రావిడ పారాయణాలు చేసి చందనాలంకరణ చేశారు. అనంతరం స్వామి వారికి బాలభోగం, గిన్నె తీర్థం అందచేశారు. ఉదయం 10గంటలకు తులసీ అర్చన అనంతరం మంగళవాయిద్యాలతో పుష్కరిణి నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి మూల విరాట్‌కు అభిషేకం, పంచామృత క్షీరాభిషేకం, సహవూసనాగవల్లి అర్చన చేశారు. అటుపై పట్టు వస్త్రాలు ధరింపజేసి, వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. యాగశాలలో వేదపండితులు, అర్చకులు త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి గావించి ఉత్సవ మూర్తులను యాగశాల నుంచి ఆలయవూపవేశం చేయించారు. ఆలయంలో కుంభ సంప్రోక్షణ చేసి స్వామి వారి ఉత్సవమూర్తులకు స్వపన తిరుమంజనం, ఊయలసేవ చేసి మంత్ర పుష్పం, మహానివేదన సమర్పించి భక్తులకు తీర్థవూపసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి వారికి ఆరాధన నిర్వహించారు. అనంతరం అమ్మ వారికి కుంకుమార్చన చేసి ఒడిబియ్యం సమర్పించి ఆలయంలో సహస్ర దీపాలంకరణచేసి, శ్రీ వేంక స్వామిని గరుడ వాహనంపై ఊరేగించారు. చివరగా కంకణోద్వాసన కార్యక్షికమాన్ని నిర్వహించి స్వామి వారికి మంత్రపుష్పం, మహానివేదన సమర్పించి సామూహిక భజనలు చేసి, భక్తులకు తీర్థవూపసాదాలు అందజేశారు.

హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని జిల్లాతో పాటు తెలంగాణ నలు మూలల నుంచి కాలినడకన, వివిధ వాహనాల్లో దీక్షాపరులు, భక్తులు రెండు లక్షలకు పైగానే కొండగట్టుకు చేరుకున్నారు. నియమ నిష్టలతో తాము తీసుకున్న మండల, అర్ధమండల, 11 రోజుల అంజనేయస్వామి దీక్షలను విరమించారు. అనంతరం తలనీలాలు సమర్పించి, పుష్కరిణిలో స్నానాలు చేసి, స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఆదివారం సాయంత్రం వరకు దీక్షా విరమణ కార్యక్షికమం నిర్విరామంగా జరిగింది.

కొండగట్టులో ప్రధానంగా నీటి సమస్యను తీర్చేందుకు ఆలయ అధికారులు పరిసరాల్లో, ఘాట్ రోడ్డుపై చలివేంవూదాలను ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. తాగు నీటి ప్యాకెట్లను సైతం అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ యాదవ్ అనే వ్యక్తి 1.50 లక్షల నీటి ప్యాకెట్లను ఉచితంగా భక్తులకు సరఫరా చేశారు. ఎంపీ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన శుద్ధ జల ప్లాంట్ సైతం భక్తులకు ఉపయోగపడింది.

జయంతి ఉత్సవాలకు వివిధ వాహనాల్లో భారీగా దీక్షాపరులు, భక్తులు తరలి రావడంతో ఆలయ అధికారులు జేఎన్‌టీయూ నుంచి బొజ్జపోతన దాకా ఏర్పాటు చేసిన మూడు వాహన పార్కింగ్ స్థలాలు, గుట్ట కింద వాహన పార్కింగ్ స్థలం శనివారం రాత్రి వరకే పూర్తిగా నిండిపోయాయి.
పోయిన ఏప్రిల్‌లో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల్లో జరిగిన తోపులాటను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా జగిత్యాల రూరల్ సీఐ గౌస్ బాబా, మల్యాల ఎస్‌ఐ విద్యాసాగర్, ఏఎస్‌ఐ రాజయ్య ఈ సారి పకడ్బందీ రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు. 11 మంది ఎస్‌ఐలు, 400 మంది పోలీసులు, హోం గార్డులు బందోబస్తు నిర్వహించారు. దీంతో జయంతి వేడుకలు సాఫీగా జరిగాయి. జయంతి రోజు అర్ధరాత్రి 12గంటలకు దీక్షాపరులు మూకుమ్మడిగా దీక్షా విరమణకు రావడం ఆనవాయితీ. దీంతో ప్రతిసారీ తోపులాట, తొక్కిసలాటకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం నాటికే వాహనాల పార్కింగ్ స్థలాలు పూర్తిగా నిండిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు శనివారం రాత్రి 9గంటల నుంచి భక్తులను గుంపులుగా ఉండనీయకుండా ఎప్పటికప్పుడు మండపాలకు తరలించారు. దీంతో శనివారం అర్ధరాత్రి వరకే 30 బ్యాచుల స్వాములు దీక్షలను విరమించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.